calender_icon.png 4 November, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యంగా ఉండొద్దు

04-11-2025 01:12:13 AM

-జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్

-తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి 

-రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ 

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఏ ఒక్క రు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు. ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలుచేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన సోమవారం గాంధీభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు, పోలింగ్ బూత్ పరిశీలకులతో నిర్వహించిన సమీక్షకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ కార్యదర్శిలు, విశ్వనాథన్, సంపత్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరే షన్ల చైర్మన్లు హాజరయ్యరు.

డివిజన్లు, బస్తీల వారీగా ప్రచార శైలి, స్థానిక పరిస్థతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం ఖాయామని, కానీ, నేతలు, ఇన్‌చార్జ్‌లు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించామని, వీటన్నింటినీ ప్రజలకు వివరించాల న్నారు. ఈ వారం రోజులు ఇంటింటా, వీధులలో ప్రచారంతో క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టాలని పార్టీ నేతలకు మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ మాట్లాడుతూ కాంగ్రెస్, అభ్యర్థి నవీన్‌పై బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పార్టీ నేతలు తిప్పి కొట్టాలని సూచించారు. పార్టీ అనుబంధ సంఘాల నేతలు కూడా ప్రచారంలో భాగస్వాములు కావాలని, ప్రతి ఓటర్‌తో టచ్‌లో ఉండాలని కాంగ్రెస్‌కు ఓటేసేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఎవరికి వారుగా తమ కు అప్పగించిన బాధ్యతలపై దృష్టి సారించాలని మె కోరారు.