04-11-2025 01:15:20 AM
							-రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కావాలి
-ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
-డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ‘వాన్ గార్డ్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి) : వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెం టర్ల(జీసీసీ)ను ప్రారంభించి, కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.
హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ‘వాన్ గార్డ్ న్యూ ఇండియా ఆఫీస్(గ్లోబల్ వాల్యూ సెంటర్)’ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రస్తుతం విశ్వసనీయత, సమగ్రత, ఇన్నోవేషన్ కు చిరునామాగా మారిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్ తమ ‘గ్లోబల్ వ్యాల్యూ సెంటర్(జీవీసీ)’ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి నిదర్శనమన్నా రు.
వాన్‌గార్డ్ ప్రపంచవ్యాప్తంగా 6.4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, అలాంటి సంస్థ మన దగ్గర కార్యకలాపాలు ప్రారంభించడం మనకు గర్వకారణమన్నారు. ప్రపంచ ఆర్థిక, సాంకేతిక పటంలో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. ప్రస్తుతం వరల్డ్ టాప్p అస్సెట్ మేనే జ్‌మెంట్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కంపెనీలు 30 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నాయని వివరించారు.
ఈ కొత్త జీవీసీ ఇంజనీరింగ్ ఎక్స్ లెన్స్, క్లౌడ్ మోడర్నుజేషన్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీకి ఒక హబ్ గా సేవలు అందిస్తుందన్నారు. ఇది వాన్ గార్డ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఎంటర్ప్రుజ్ సొల్యూషన్స్‌తో నూతన ఆవిష్కరణలకు మార్గ నిర్దేశం చేస్తుందన్నారు. వాన్ గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వా మ్యం కావాలని పిలుపునిచ్చారు.