08-11-2025 12:00:00 AM
రైతులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హామీ
గాంధారి నవంబర్ 7 (విజయక్రాంతి) : మండలంలోని రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు నేను మీకు అండగా ఉంటాను అని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు గాంధారి మండల పర్యటనలో భాగంగా మేడిపల్లి సర్వపూర్ గ్రామం ల లో వడ్లు కొనుగోలు కేంద్రంని ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులకు రైతులకు అడిగి తెలుసుకున్నాను.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దు, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది అని రైతాంగానికి భరోసా ఇచ్చారు.అలాగే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగతంగా కలిసి, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతానని తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు కష్టపడి పండించిన పంటకు న్యాయం జరిగే వరకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని కొన్ని రోజులపాటు వరి కోతలను వ్యవసాయ అధికారులను సంప్రదించి వాయిదా వేసుకోవాలని తద్వారా కొంతమేరకు నష్టాన్ని నివారించవచ్చని ఆయన అన్నారు.
మండలంలోని అధికారులు రైతుల చివరి గింజ కొనుగోలు చేసేంతవరకు ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా రైతులకు అందుబాటులో ఉండి వడ్లను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగాని బాబా, మండల నాయకులు ముకుందరావు, దశరద్ నాయక్ గడ శంకర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.