calender_icon.png 9 November, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో రోజుకు చేరుకున్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల బంద్

08-11-2025 12:00:00 AM

యాదాద్రిభువనగిరి, నవంబర్ 7 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరవధిక బంద్ నేడు నాలుగవ రోజు కొనసాగింది ఈ సందర్భంగా శుక్రవారంనాడు భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు ధర్నా నిర్వహించారు. అనంతరం డి.ఏ.ఓ శ్రీమతి రాధ గారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల అసోసియేషన్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి అసోసియేట్ ప్రెసిడెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూనాలుగవ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలు బంద్లో పాల్గొన్నాయి.కళాశాలల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దెబ్బతింటోంది. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి.స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మరింత తీవ్రంగా జరుగుతాయి అని అన్నారు.

శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిక్క ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించాలి.ప్రైవేట్ కళాశాలలు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.బకాయిలు విడుదల చేస్తేనే కళాశాలలు సజావుగా కొనసాగుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో  జాగృతి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మనిపాల్ రెడ్డి, అలాగే పలు కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.