calender_icon.png 9 November, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

08-11-2025 12:00:00 AM

ఆలేరు, నవంబర్ 7 (విజయక్రాంతి): ఆలేరు పట్టణ కేంద్రం లో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కళ్ళకు గంతలుకట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో దాదాపు 8300 కోట్ల స్కాలర్ షిప్స్ ఫీజు రీయాంబర్స్ మెంట్ విడుధల చేయక రాష్ట్రవ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని విద్యారంగం అభివృద్ధికి కృషి చేయాలన్నారు

ఈ విషయంలో జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు లేని గ్రామంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు కళాశాలకు విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళితే కాలేజీల యాజమాన్యం డబ్బుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తుంది కావున విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ మండల ఉపాధ్యక్షులు మద్దెల సాయి గణేష్, సభ్యులు  గోపగాని అభినవ్, చిలుకు సిద్దార్థ్, గుండ్రాజు విష్ణు వర్దన్, మామిడాల సంపత్, నీల భరత్, చిన్నం పరుషం, కన్నాయ్ మణిదీప్, మహంకాళి సంజయ్, భూపతి బాలు, దొరగళ్ల రాజు తదితరులు  పాల్గొన్నారు.