calender_icon.png 23 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి మోసపోవద్దు..

22-10-2025 07:34:38 PM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. రసాయన ఎరువుల, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యామల దేవీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉత్తం, పీఏసీఎస్ ఛైర్మన్ డోంగ్రే మారుతి, వ్యవసాయ అధికారి గణేశ్, తహసీల్దార్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జహీర్, మార్క ఫెడ్ అధికారులు, డైరెక్టర్లు, పిఏసీఎస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.