29-11-2025 12:29:01 AM
ఎలక్షన్ కమిషన్‌కు స్థానిక ప్రభుత్వాల సాధికారితా వేదిక విజ్ఞప్తి
ఖైరతాబాద్ ; నవంబర్ 28 (విజయ క్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ వీవీ రావు కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ప్రభుత్వాల సాధికారితా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్ రావుతో కలిసి మాట్లాడారు.. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న సంద ర్భంలో వేలం పాటలు, బలవంతపు ప్రలోభాల ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉందని, ఫలితంగా ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందన్నారు.