calender_icon.png 27 August, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాలోని వదంతులను నమ్మొద్దు

27-08-2025 12:13:14 AM

600 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ అఖిల్ సమీక్ష

ఆదిలాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): జిల్లా రేపటి నుండి 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని, నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తును జిల్లా వ్యాప్తంగా ఏర్పా టు చేయడం జరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ప్రజలందరూ కలిసిమెలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రానున్న పండగలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం పోలీ సు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు అధికారులకు ఎస్పీ దిశా నిర్దే శం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ప్రజలందరూ, గణపతి మండప సభ్యు లు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసు ల ద్వారా తెలియజేసిన సూచనలను తప్పకుం డా పాటించాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా 600 మంది పోలీసు సిబ్బందితో గణపతి నవరాత్రి ఉత్సవాలకు బందోబస్తు, 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిమజ్జనం ప్రదేశాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి మొదటి రోజు నుండే బందోబస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. పలు సమస్యాత్మక ప్రాంతాలలో శాశ్వతంగా 11 రోజుల పాటు పికెట్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

ప్రధానమైన పట్టణాలలో క్లస్టర్లు, సెక్టార్లుగా విభజించి బందోబస్తు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 సెక్టార్లుగా విభజించి బందోబస్తును రూపొందించినట్లు తెలిపారు. ఈ 11 సెక్టార్లలో ఉన్న ప్రాంతాలలోని గణపతి మండపాలను సిబ్బంది రెండు గ్రూపులుగా మూడు షిఫ్టుల్లో గస్తీ నిర్వహిస్తూ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. 

ప్రతి సెక్టార్‌కి రిజర్వ్, ఎస్‌ఐ స్థాయి అధికారిని పర్యవేక్షించడానికి నియమించడం జరి గిందని తెలిపారు. మొత్తం ప్రాంతాన్ని నాలు గు క్లస్టర్లుగా విభజించి ఒక క్లస్టర్ కి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించి బందోబస్తును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  సోషల్ మీడియాలో ఎలాంటి అసత్య ప్రచారాలు జరగకుండా సోషల్ మీడియా బృందం పర్యవేక్షిస్తుందని, ప్రజలను రెచ్చగొట్టేటువంటి అసత్యాలను ప్రచారం చేసిన వారిపై, వాట్సాప్ గ్రూపు యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, పట్టణ సిఐలు పాల్గొన్నారు.