calender_icon.png 27 August, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

27-08-2025 02:18:46 AM

కోనరావుపేట ఆగష్టు 26 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, కోనరావుపేట జంక్షన్ వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండల గౌడ సం ఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని బహుజనుల ఆ కాంక్షను నెరవేర్చడానికి సర్వాయి పాపన్న పోరాటం చేశారని అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నేడు ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని వారి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలి యజేసేలా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఆలోచనతో హైదరాబాద్ నడిబొడ్డున వారి విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిసిసి చీప్ మహేష్ గౌడ్ భూమి పూజ చేశారని అన్నారు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రిజర్వేషన్లు అమలు అయితే బీసీలకు ఉద్యోగ విద్య రాజకీయ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వతహాగా బీసీ కాకుండా బీసీల అభ్యున్నత కోసం పాటుపడుతున్నారని రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు పోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు అబ్బసాని శంకర్ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు బుర్ర నారాయణ గౌడ్, పులి లక్ష్మీపతి గౌడ్, సం పునూరి మల్లేశం గౌడ్,మాజీ ఎంపీపీ చెంద్రయ్య గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంగలి వెంకన్న గౌడ్, బుర్ర రవితేజ గౌడ్, ఏఎంసి చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి,గౌడ సంఘం నాయకులు తదితరులుపాల్గొన్నారు.