calender_icon.png 29 October, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్బందులకు గురి చేయకూడదు

29-10-2025 12:25:34 AM

 పూలే విజ్ఞాన కేంద్రంకు శంకుస్థాపన చేయడం 

ఎంతో సంతోషాన్ని కలిగించింది: -ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్నగర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పట్టణంలోని టిడి గుట్ట రైల్వే గేటు వద్ద మం గళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. భారత రైల్వే శాఖ డబుల్ లైన్ రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో, రైల్వే శాఖ ప్రహారీగో డ (కాంపౌండ్ వాల్) నిర్మించింది.

రైల్వే కాంపౌండ్ వాల్ ద్వారా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే తెలుసుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహం దగ్గర పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని పనులకు శంకుస్థాపన, టిడి గుట్ట రైల్వే గేటు నుండి బోయపల్లి రైల్వే గేటు వరకు రైల్వే ట్రాక్ ప్రక్కన ఉన్న నివాస ప్రాంతాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలే విజ్ఞాన కేంద్రం సంబంధించి శంకుస్థాపన చేయడం చా లా సంతోషాన్ని కలిగించిందని ఇప్పటివరకు ఏ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఇంత ఆ నందం కలగలేదన్నారు.

అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజలకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరియు సిసి రోడ్ నిర్మాణం చేపట్టాలి. ఈ పనులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసి, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులు నాణ్యతతో, శరవేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.

ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. న్యూ టౌన్ లో గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బోయపల్లి అంగన్వాడి కేంద్రాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా, సాదుల్లా, ఫకృ ఖురేషి , దోమ పరమేశ్, సలీం, చర్ల శ్రీనివాసులు, మోయీజ్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాషెద్ ఖాన్, ఖాజా పాషా, మునీర్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.