calender_icon.png 29 October, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం

29-10-2025 12:26:49 AM

ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి హామీ

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 28(విజయ క్రాంతి): మృతురాలి శ్రావణి కుటుం బానికి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా దయగ మండలం గేర్రె గ్రామాన్ని సందర్శించిన ఆమె శ్రావణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రావణి హత్యకు కారకులైన వారి ని చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

పర్యటనకు వచ్చిన ఎస్టీ ఎస్సీ కమిషన్ సభ్యురాలు నీలాదేవికి టి ఏ జి ఎస్, డివైఎఫ్‌ఐ, కెవిపిఎస్, ఏఐఏ డబ్ల్యూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం నియోజకవర్గ ఇంచార్జ్ ముంజం ఆనంద్ కుమార్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పెల్లి అశోక్,

డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ తెలంగాణ ఆదివా సి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్క న్న, మండల అధ్యక్షులు సిడాo శంకర్, మం డల కమిటీ సభ్యులు నైతం అంజన్న, సిడాం శంకర్, కట్టేకొల్ల హనుమంతు, దాసరి శంకర్, కోడెల పోషం, మేకల శంకర్, మాజీ సర్పంచ్ కోడెల బానక్క పాల్గొన్నారు.