calender_icon.png 21 July, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని శంకించొద్దు

20-07-2025 12:54:29 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, జూలై 19 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై తమ చిత్తశుద్ధిని శంకిస్తే పుట్టగతులు ఉండవని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీల మీద ప్రేమ ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును ఆమోదించుకుందాం రావాలని కోరారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అడ్డంకులు వస్తే ఆర్డినెన్స్ తెచ్చి సవరిస్తున్నామని చెప్పారు.

కుల గణన మొదలు ఆర్డినెన్స్ వరకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, ఇది కాకుండా ఎలా అమలవుతాయో చెప్పాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలు ఎలా పోరా డాయో .. రిజర్వేషన్లు కాపాడుకోవడానికి తగిన బుద్ధి చెప్పి పోరాడాలని కోరారు.

42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అండగా ఉండాలని అన్నారు. కరీంనగర్ పట్టణంలో మాజీ మంత్రి చొక్కారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్య నేతలతో కలిసి నివాళులర్పించారు.