calender_icon.png 21 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలి

20-07-2025 12:53:17 AM

ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ

ముషీరాబాద్, జూలై 19(విజయక్రాంతి): ఓయూ పీహెచ్డీ  అడ్మిషన్ల ఫలితాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలని ఎంఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని వివిధ డిపార్ట్మెంట్లలో కేటగిరి-2 పీహెచ్డీ (2025) అడ్మిషన్ల కేటాయింపులో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయకుండా మాదిగ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఓయూ అధికారులు కుట్రలు చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ  ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆరట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.

అనంతరం శేఖర్ మాదిగ మాట్లాడుతూ విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో మాదిగలు ఉపకులాలు నష్టపోవడం వల్లనే గత మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘంగా ఉద్యమించిన ఫలితంగా నే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు జరుగుతుందన్నారు.

ఓయూ పీహెచ్డీ అడ్మిషన్లలో వర్గీక రణ చట్టం అమలు చేయకుండా ఎందుకు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓయూ అధికారులను ప్రశ్నించారు. మాది గ విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా కుట్రలు చేస్తున్న ఓయూ అధికారుల తీరుపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పందించి మాదిగ విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే విద్యా శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ, రాష్ట్ర సీనియర్ నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఏడవెల్లి అజయ్ మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జన్నపాల మహేష్ మాదిగ, ఓయూ అధ్యక్షులు మంద రాజు మాదిగ, డా. సగ్గుర్తి పుల్లయ్య మాదిగ, చెరుకుపల్లి అనిల్ మాదిగ, నిశాంత్ మాదిగ, చెరిపల్లి అశోక్ మాదిగ, రమేష్, నకిరేకంటి సతీష్ మాదిగ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.