calender_icon.png 13 October, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బౌలర్లను అలా బాదేయకు

13-10-2025 01:09:15 AM

-జైస్వాల్‌తో లారా ఫన్నీ కామెంట్స్

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్‌లో దుమ్మురేపుతు న్నాడు. స్వదేశమైనా, విదేశాల్లోనైనా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా వెస్టిండీ స్‌తో రెండో టెస్టులో భారీ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా జైస్వాల్‌ను అభినందించా డు.

రెండో టెస్ట్ మూడోరోజు బ్రేక్ టైమ్‌లో జైస్వాల్‌తో సరదాగా ముచ్చటించాడు. తమ బౌలర్లను అలా బాదేయొద్దంటూ సరదాగా రిక్వెస్ట్ చేశాడు. కొంచెం కనికరం చూపాలం టూ లారా జైస్వాల్‌తో అన్న మాటలు ప్రస్తు తం వైరల్‌గా మారాయి. బాగా ఆడుతున్నా వ్ కీపిటప్ అంటూ లారా అతన్ని ప్రశంసించాడు. కాగా డబుల్ సెంచరీ చేజారినందుకు తా ను బాధపడడం లేదని, అది ఆటలో బాగమేనంటూ జైస్వాల్ చెప్పుకొచ్చాడు.