12-07-2025 01:06:24 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాలు, నిర్వాహకులపై నిఘా పెట్టాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్ ఆదేశించారు. కల్తీ కల్లు, కాంపౌండ్‌ల నిర్వహణ, కల్లు వినియోగం, అమ్మకాల్లో జరుగుతున్న తప్పిదాలపై ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని సూచించారు. ఎక్సై జ్ శాఖ డిప్యూటీ కమిషనర్లతో శుక్రవారం అబ్కారీభవన్‌లో కమిషనర్ హరికిరణ్ సమీక్ష నిర్వహిం చారు.
కల్లు కాంపౌండ్‌లపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే బాలానగర్ ఎస్‌హెచ్‌వోను సస్పెండ్ చేశామని చెప్పారు. జిల్లాల ఎక్సైజ్ అధికారులు, యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.
కానిస్టేబల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు ప్రమోషన్ల కోసం జోన్లవారిగా జాబితాలను సిద్ధం చేసి ప్రమోషన్లు ఇవ్వాలని కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, పీ దశరత్, ఏ శ్రీనివాస్‌రెడ్డి, వీ సోమిరెడ్డి, ఖమ్మం, మెదక్ అసిస్టెంట్ కమిషనర్లు గణేష్, జీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.