calender_icon.png 7 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటును అమ్మొద్దు అభివృద్ధిని మరవద్దు

06-12-2025 12:00:00 AM

సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ 

నూతనకల్ డిసెంబర్ 5: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల అధికారుల ఆదేశాల మేరకు సాంస్కృతిక సారథి  జిల్లా కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కళాబృందం జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, మద్యం, మాంసానికి అమ్ముడుపోయి ఓటును అమ్ముకోకూడదని, నిజాయితీగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును యువతి, యువకులు  వినియోగించుకోవలనీ ఆయన అన్నారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీంలీడర్ పల్లెల లక్ష్మణ్, గంట బిక్షపతి, గడ్డం ఉదయ్, పల్లెల రాము, మాగి శంకర్, పాక ఉపేందర్, మద్దిరాల మంజుల, కుందమల్ల నాగలక్ష్మి, ములకలపల్లి మల్లమ్మ, సిరిపంగి రాధ, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.