calender_icon.png 7 December, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శబరి మాత పాదుకాపూజోత్సవం

06-12-2025 12:00:00 AM

  1. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు 

అలరించిన నృత్యాలు 

తాడ్వాయి, డిసెంబర్ 5:( విజయ క్రాంతి): తాడువాయి లోని శ్రీ శబరి మాతాజీ పాదుకాపూజోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరి మాతాజీ ఆశ్రమం పక్కనే ఉన్న గుట్టపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శుక్రవారం అమ్మవారి పాదుక పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు నిర్వహించిన మంత్రోచ్ఛరణల మధ్యన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ శబరిమాత భక్తులు తరలివచ్చి పాదుకాపూజోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు.

అమ్మవారి పాదుకలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఉదయం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శ్రీ శబరిమాత పాదుకలను ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.

గ్రామంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో భక్తులు అమ్మవారి పాదుకలను దర్శించుకుని పూజలు చేశారు. ఊరేగింపులో కళాకారులు నిర్వహించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో తాడ్వాయి గ్రామమంతా కిటకిటలాడింది.  ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆశ్రమ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

పాదుక పూజలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ అమ్మవారి పాదుకపూజోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి పాదుకులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు 

భక్తులందరికీ అన్నదానం 

అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఉదయం నుంచే అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు .

అమ్మవారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని, కోరుకున్నది అవుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం రెండు రోజులపాటు నిర్వహించే జాతర ఉత్సవాలకు మండలంలోని భక్తులె కాకుండా చుట్టుపక్కల మండలాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి , అంబీర్ శ్యామ్ రావు, ఆకిటీ వెంకట్ రామ్ రెడ్డి, రాఘవరెడ్డి, శంకర్ రావు,రామ శంకర్,మేకల రాజు, సంజీవులు, యువకులు తదితరులు  పాల్గొన్నారు.