06-12-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 05 : సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. గ్రామస్తులతో చర్చించి భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తానని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో చింతమడక మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల శేఖర్, గ్రామస్తులు ఆకుల వెంకట్ గౌడ్, చెప్యాల లక్ష్మణ్, బాలరాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.