calender_icon.png 13 July, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు జీవించే హక్కు లేదా?

23-08-2024 12:00:00 AM

జి.అనురాధ :

కలకత్తా ప్రభుత్వ హాస్పిటల్ ఆర్జికార్‌లో 31 ఏండ్ల జూనియర్ డాక్టర్ ను రేప్ చేసి అతిదారుణంగా హత్య చేయ డం చూస్తే ‘అర్ధరాత్రి మహిళలు నిర్భయం గా  ప్రయాణించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని నమ్ముతాను’ అ న్న మహాత్మాగాంధీ మాటలు గుర్తుకు వ స్తున్నాయి. జూ॥ డాక్టర్ అర్ధరాత్రి ఎక్కడికి ప్రయాణించలేదు. ఆమె పని చేస్తున్న హా స్పిటల్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. అక్క డ మహిళల రక్తం తాగే జలగలు ఉంటాయని, అవి తన ప్రాణం తీస్తాయని ఊ హించలేదు. రాత్రి, పగలు అనే తేడా లే కుండా 36 గంటలపాటు అలసట మరిచి వైద్యసేవలు అందించి, తెల్లవారు జామున 2 గంటలకు నిద్రించారు.

అదే అదునుగా కాచుకొని చూస్తున్న మానవమృగం ఆమె పై దారుణంగా అత్యాచారం చేసి అతిక్రూరంగా హత్య చేశాడు. ఉత్తరాఖండ్‌లో ఒక నర్సును జూలై 30న కిడ్నాప్, అత్యాచారం తర్వాత తలపై బండతో కొట్టి హత్య చేసిన సంఘటన వారం రోజుల తరువాత బయటకు రావడం, ఆ మరుసటి రోజు కోల్‌క తాలో జూ॥ డాక్టర్‌పై అనాగరిక లైంగిక దాడి, హత్య జరగడం గమనిస్తే దేశంలో మహిళలకు ఉన్న రక్షణ ఏపాటిదో అర్థమవుతుంది.

దేశం యావత్తు మహాత్మాగాం ధీని జాతిపితగా పిలుచుకుంటున్నారు. ఆ యన ఫొటోలను రాజ్యాంగ నిర్మాత డాక్ట ర్ అంబేద్కర్ ఫొటోతోపాటు పార్లమెం టు, అసెంబ్లీలలో ప్రభుత్వ కార్యాల యాల లో పెడుతున్నారు. భారత రా జ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పా లకులు గాంధీజీ నిజమైన స్వాతం త్య్రం గురించి చెప్పిన మాటలను గాలికి వదిలివేశారు. ‘ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు’ అని మహాత్ము డు చెప్పిన మాటలను ఈ ప్రభుత్వా లు ఏ మాత్రం వంట పట్టించుకోవడం లేదు.

సమాధానాలు దొరకని ప్రశ్నలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూ॥ డాక్టర్ హత్యాచారం సమాజానికి అ నేక విషయాలను తెలియజేస్తున్నది. ఆగ స్టు 9న కోల్‌కతా ఆర్జీకార్ ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఆమె విధి నిర్వహణ లో రోగులకు సేవలు అందించి, విశ్రాంతి నిమిత్తం తెల్లవారు జామున హాస్పిటల్ సె మినార్ హాల్‌కు వెళ్లి నిద్రించారు. హాస్పిటల్‌లో పోలీసులు పెట్టుకున్న కాంట్రాక్టు ఉ ద్యోగి సంజయ్‌రాయ్ తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్య ఆమెపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ మె శరీరం మొత్తం గాయాలు కావడం, కా ళ్లు విరిగిపోవడం, మెడవద్ద (థైరాయిడ్ కా ర్టిలేజ్)విరిగిపోయి రక్తం కారినట్ల్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.

దేశంలో మహి ళలకు అందులో వృత్తి సంబంధిత డాక్టర్ల కు ఉన్న రక్షణ ఏమిటని జూ॥ డాక్టర్ మర ణం దేశ ప్రజలను ప్రశ్నిస్తున్నది. హత్య అ నంతర పరిణామాలు చూస్తే ఎన్నో సందేహాలు, ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నద ని ఆర్జీకార్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడం ఏమి టి? ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు వెంటనే ఎందుకు చూపించలేదు? సీసీ కె మెరాలు ఎప్పటి నుంచో పని చేయడం లే దన్న మాటల్లో నిజం ఎంత? నేరం జరిగిన సమీపంలో ఉన్న గోడలను ఎందుకు కూ ల్చారు? అంత ఆందోళనలు చేస్తున్నా గో డల నిర్మాణం ఎందుకు చేపట్టారు?

హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద చర్యలు చేప ట్టకుండా కేవలం ట్రాన్స్‌ఫర్ చేయడం వె నుక కారణాలు ఏమిటి? సెలవులో పం పించాలని కోర్టు ఆదేశించే వరకు రాష్ట్ర ప్ర భుత్వం ఎందుకు చోద్యం చూసింది? డాక్టర్‌పై అత్యాచారం చేసిన దోషులను అరెస్టు చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని, డాక్టర్లకు తగిన భద్రత కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న వైద్యులకు సెక్యూరిటీ కల్పించకుండా ఉండటం ఏమిటి? 40 మంది గూండాలు దాడి చే యడం, వైద్య సిబ్బందిని భయభ్రాంతుల కు గురిచేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?

జూ॥ డాక్టర్‌పై అత్యాచారంతో హత్య చేసి న దోషులను కఠినంగా శిక్షించాల్సిన, ని ష్పాక్షికంగా విచారణ చేయాల్సిన ప్రభు త్వం, పోలీసు యంత్రాంగం, వాస్తవాలు చెప్పాల్సిన హాస్పటల్ అధికార యం త్రాంగం వైఖరిని గమనిస్తే వారు దోషులను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు గా కనిపిస్తున్నది. హాస్పిటల్ సూపరింటెండెంట్ సందీప్ ఘోష్ మాటలు, ఆయన ప్రవర్తన, ఆయనపై ప్రభుత్వం చూపుతున్న అపారమైన ప్రేమను గమనిస్తే దోషులు ఎవరో వారికి తెలుసునని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవు తుంది.  కోర్టు జోక్యం చేసుకోవడంతో కేసులో కదలిక వచ్చి దోషిగా ఉన్న సంజయ్‌రాయ్‌ని అరెస్టు చేయడం జరిగింది. అయినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేకుండా ఉండటంతో కేసు ప్రాధాన్య తను గుర్తించి సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది.

బాధ్యత మరిచిన నేతలు

అల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు దోషులను కఠినంగా శిక్షించాలని, తమకు రక్షణ కల్పించాలని డి మాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా డాక్టర్లు ఆం దోళనలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో హాస్పిటల్స్‌లో వైద్యసేవలు ఆగిపోయాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బందికి మనోధైర్యం కల్పించాల్సిన రాష్ట్ర, కేం ద్ర ప్రభుత్వాలు ప్రజా సౌకర్యం రీత్యా వా రి సమస్యలను పరిష్కరించి ఆందోళనలు విరమించుకోవాలని కోరాలి. ఈ బాధ్యతను విస్మరించి తృణమూల్ కాంగ్రెస్, బీ జేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వైద్యులు చేస్తున్న ఆందోళనకు దేశం యావత్తు అండగా ఉండాలి.

మగవాళ్లలో మార్పు రాలేదు

దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతు న్న లైంగిక దాడులు హత్యలు పెరిగిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. మహి ళలను మనిషిగా చూడక పోవడమే. మహిళలను విలాస వస్తువులుగా, మగవాళ్ల కో రికలు తీర్చే సెక్స్ సింబల్స్‌గానే చూస్తున్నా రు. సినిమాల్లో, ప్రచార సాధనాల్లో, సాహిత్యంలో అంగాంగ వర్ణనలు చేస్తున్న పరిస్థి తి ఉన్నది. వావి వరసలు లేకుండా చిన్న పిల్లల నుండి పండు వృద్ధుల వరకు, అం ధుల నుండి అనాథల వరకు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి.

దోషులకు కఠిన శిక్షలు, మహిళల రక్షణకు చర్య లు లేవు. గుట్కా, గంజాయి, హుక్కా, హె రాయిన్ తదితర మత్తు పదార్థాలను కాలేజీలు, స్కూల్స్, పబ్బులు, హోటళ్లకు సప్ల యి చేస్తుండం వల్ల ఎక్కడ చూసినా యు వకులు, విద్యార్థులు వాటికి బానిసలుగా మారిపోతూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా రు. స్త్రీలను పిల్లలు కనే యంత్రాలుగా వం టింటికే పరిమితం చేసే మనువాద భావజాలాన్ని అణువణువునా ఎక్కించుకొన్న మూఢ హిందుత్వ ఫాసిస్టు శక్తుల ప్రభా వం మరొక వైపున ఉంది. ఇవి మారకుం డా ‘బేటీ పఢావో- బేటీ బచావో’ అంటూ ఎన్ని నినాదాలు చేసినా మహిళలకు ఎంత మాత్రమూ ఉపయోగం ఉండదు.

వ్యాసకర్త అధ్యక్షురాలు, 

ఐఎఫ్‌టియూ, తెలంగాణ

సెల్: 9959632366