11-09-2025 01:00:50 AM
చారకొండ సింగిల్ విండో చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్
చారకొండ, సెప్టెంబర్ 10 : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులు యూరియాపై ఎలాంటి ఆందోళన చెందొద్దని చారకొండ సింగిల్ విండో చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మండలంలోని రైతులు పంట సాగు ఎక్కువగా చేశారని చెప్పారు.
గత ఏడాది 4,650 బస్తాలు 209 మెట్రిక్ టన్నులు యూరియ సరఫరా చేయడం జరిగిందని, ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారం వరకు 6,250 బస్తాలు 281 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. మండలంలో ఎలాంటి యూరియా కొరత లేదని, కొంత ఆన్లైన్ కారణంగా యూరియా సరఫరా ఆల స్యం అవుతుందని చెప్పారు.
నానో యూరియాపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహ న కల్పిస్తున్నారని, నానో యూరియా వల్ల మంచి ఫలితాలు వస్తుందని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో సీఈవో భూత్పూర్ వెంకటయ్య, సిబ్బంది భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.