calender_icon.png 26 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన సైట్ ఇంజినీర్

26-09-2025 12:07:23 AM

వరంగల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): హనుమకొండలో రూ. 8 వేలు లంచం తీసుకుంటూ సైట్ ఇంజినీర్ సామల రమేష్ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. హనుమకొండలో తెలంగాణ స్టేట్ ఎడ్యుకే షన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైట్ ఇంజినీర్ (ఔట్ సోర్సింగ్)గా సామల రమేష్ విధులు నిర్వహిస్తున్నాడు. జనగామ జిల్లా కొడకండ్ల జడ్పీ హైస్కూల్‌లో పీఎంశ్రీ పథకంలో సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనుల తుది బిల్లును ప్రాసెస్ చేసి,

ఫార్వార్డ్ చేయడానికి బాధితుడి నుంచి రూ.18 వేలు డిమాండ్ చేశాడు. మొదటగా రూ.10 వేలు ఫోన్‌పే ద్వారా స్వీకరించాడు. ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించి, వారి సూచన మేరకు గురువారం హనుమకొండ లోని ఆఫీసులు రూ.8 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రూ.8 వేలు నుండి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రమేష్‌ను అరెస్టు చేశారు.