30-01-2026 12:06:19 AM
ఉద్యోగ విరమణ సన్మానంలో అనిల్ కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, జనవరి 29 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్బండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉద్యోగ విరమణ సన్మాన మహోత్స వానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత గురువు స్థానం అత్యంత గొప్పదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా ఉపా ధ్యాయులదేనని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు, న్యాయవాదులు, రాజకీయ నాయ కులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఎదగడానికి తొలి మెట్టు గురువేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, డివిజన్ సెక్రటరీ ఎం.డి. అజామ్, ఐవైసీ డివిజన్ అధ్యక్షుడు కోడిచర్ల మహేందర్, ఇమ్రాన్, రిషి రాయ్, లావణ్ కుమార్, ఆకాష్ పాల్గొన్నారు.