30-01-2026 12:03:48 AM
నాగల్ గిద్ద, జనవరి 29: నాగల్ గిద్ద మండల పరిధిలోనీ కారముంగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ నోడల్ అధికారి ప్రదీప్ కుమార్, ఎండీ వాహా బ్, నింహాడ కృష్ణయ్య కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల గైర్హాజరు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలు, టిఎల్‌ఎం, యాఫ్.ఎల్.ఎస్, పాఠశాల పలు రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య,వసతులు అందించడ మే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వారితోపా టు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హల్లె బసవరాజ్, సి ఆర్ పి అర్జున్, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.