12-07-2025 12:46:18 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రిజర్వేషన్ల అంశంలో బీసీల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీసీల ఉద్యమంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరి గిందన్నారు. గవర్నర్ ద్వారా కేంద్రానికి బిల్లు పంపి, ఇప్పుడు దాన్ని బైపాస్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
గత అనుభవాల నేపథ్యంలో తమకు ప్రభుత్వంపై అనుమానాలున్నాయ ని.,42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వ కపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.
మాజీ మంత్రి కమలాకర్ మాట్లాడు తూ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించే అవకాశముం టే 20 నెలలు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎన్నికల కోసం బీసీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి దిల్లీలో డ్రామా చేశారని ఆరోపించా రు. చట్టబద్ధత లేకుండా ఆర్డినెన్స్ ఇవ్వడం సరైంది కాదని రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర పేర్కొన్నారు.