02-07-2025 12:11:34 AM
జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ -
కామారెడ్డి , జూలై 1 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో సెర్ప్ , డిఆర్డిఏ సిబ్బంది బదిలీలు ప్రక్రియ లో భాగంగా మంగళవారం నిజామాబాద్ నుండి ఇద్దరు డిపిఎంలు శ్రీనివాస్ , సాయిలు , నిర్మల్ జిల్లా నుండి వచ్చిన శోభారాణి , సిద్దిపేట జిల్లా నుండి వచ్చిన రాజయ్య , కామారెడ్డి జిల్లాలో ఇదివరకు పనిచేస్తున్న సురేష్ కుమార్ లు నియమితులయ్యారు.
డిపిఎంలను డిఆర్డిఓ , జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అందర్నీ పరిచయం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన డిపిఎంలు అన్ని అంశాల్లో మోడల్ గా ఉండాలని, అంకితభావంతో పనిచేయాలని నూతనంగా వచ్చిన డి.పి.యం లకు సూచించారు. ఇ కార్యక్రమంలో APౄ , జిల్లా సమైక్య ప్రతినిధులు, ఏపీఎంలు, స్త్రీ నిధి సిబ్బంది మరియు జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు.