02-07-2025 12:10:32 AM
ములుగు, జులై1(విజయక్రాంతి): ములుగు జిల్లా విద్యాశాఖ అధికారిగా దురిశెట్టి చంద్రకళ నియామకం చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన జి.పాణిని గత నెల 16న ఏసీబీ అధికారులు కస్టడికి తీసుకోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టుకు ఖాళీ ఏర్పడిందని.
ఈ సందర్భంలో హనుమకొండలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న డి. వాసంతికి బాధ్యతలు అప్పగించగా ఆమె విధులలో చేరకపోవడంతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న దురిశెట్టి చంద్రకళకు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.