24-12-2025 12:08:34 AM
కుకట్‌పల్లి ‘శ్రీచైతన్య’ జోన్‌లో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): డా. బిఎస్‌రావు స్మారక జోనల్ క్రీడా పోటీలు--2025 మంగళవారం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, హైదర్‌నగర్‌లో నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో 14 బ్రాంచీల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను గిన్ని స్ వరల్డ్ రికార్డు సాధించిన క్యారమ్ క్రీడాకారిణి డా. షేక్ హుస్నా సమీరా ప్రారంభించారు. ఏజిఎం శివ రామకృష్ణ, రీజినల్ ఇన్చార్జిలు, జోనల్ ఇన్చార్జ్, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్, ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. పరుగు పందాలు, ఖో-ఖో, వాలీబాల్, త్రో బాల్, షాట్పుట్ వంటి వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి.