calender_icon.png 24 December, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టులో వాదనలు ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు

24-12-2025 12:10:19 AM

రాజాపూర్, డిసెంబర్ 23 : విద్యార్థులకు న్యాయ చట్టాలు, నేరాలను చేస్తే వాటి పర్యావసనం గురుంచి అవగాహన కోసం కోర్టు లో న్యాయవాదుల వాదనలు ప్రత్యేకంగా వినిపించినట్లు ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు.మంగళవారం రాజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు జడ్చర్ల సివిల్ కోర్ట్‌లో జరుగుతున్న న్యాయవాదుల వాదనలు ప్రత్యేకం గా జూనియర్ జడ్జి  అనుమతితో  కోర్టు నియమ నిబంధనలను అనుసరించి విక్షించినట్లు తెలిపారు.

కోర్టు కేసులకు సంబంధించిన లాయర్ల వాదన,ప్రతివాదన, సాక్షులను ప్రవేశపెట్టడం, వారి వాంగ్మూలం  రికార్డు చేయడం, జడ్జి విన టం, విన్న విషయాలు రికార్డ్ చేయడము,  తీర్పు ఎలా వెలవరుస్తారో ,తదితర విషయాలు కోర్టులో ప్రత్యక్షంగా విద్యార్థులు  గమనించినట్లు తెలిపారు.  అనంతరం సివిల్ కోర్టు న్యాయమూర్తి చట్టాల పైన విద్యార్థులకు చక్కన అవగాహన కల్పించారు. 

కోర్టులో విషయాలు ఎలా జరుగుతాయో ఎలాంటి నేరాలకు ఎటువంటి శిక్షలు విధిస్తారో ప్రత్యేకంగా చూసిన విద్యార్థులను నాయమూర్తి కోర్టులో  స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు జీవితంలో మర్చిపోలేని విధంగా ఈరోజు ప్రత్యక్ష అనుభ వాన్ని పొందా మని సంతోషం వ్యక్తం చేశారు. సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు న్యాయమూర్తి కి, న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు మోజేష్, సరళ తదితరులు పాల్గొన్నారు.