07-07-2025 12:00:00 AM
సిద్దిపేట డాక్టర్‌కి గవర్నర్‌తో సన్మానం
సిద్దిపేట, జులై 6 (విజయక్రాంతి): సిద్దిపేటలోని కేర్ హాస్పిటల్ కి చెందిన ప్రముఖ న్యూరోలాజి డాక్టర్ మణిదీప్ రావు వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించినందుకు గాను మెడికల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఆదివారం ఈ పురస్కారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
డాక్టర్ మణిదీప్ రావుకి అవార్డు రావడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. అవార్డు గ్రహీత డాక్టర్ మణిదీప్ రావు మాట్లాడుతూ ఈ అవార్డు తనకు రావడం గర్వంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇది మరింత ప్రేరణగా కలిగిస్తుందన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ మణిదీప్ రావు ను అభినందించారు. తమ వైద్యుడు గవర్నర్ తో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కేర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గజ్వేల్ శ్రీకాంత్ హర్షంవ్యక్తం చేశారు. డాక్టర్ అవార్డు పొందడం మరింత ప్రోత్సాహకంగా పనిచేయాల్సిన బాధ్యత పెరిగిందని తెలిపారు.