07-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, జులై 6 : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మొహర్రం ప్రతీక అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని జీఎంఆర్ యువసేన నాయకులు షకీల్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్..
దార్శనికుడు, దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, కొమరగూడెం వెంకటేష్, రుద్రారం శంకర్, అఫ్జల్, పృథ్వీరాజ్, చంద్రశేఖర్, శ్రీరాములు, షకీల్, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వాణినగర్ లోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన రజత కవచ అలంకరణ ఉత్సవాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిధిలో గల హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, జిన్నారం మాజీ జెడ్పిటిసి కొలను బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణ, తలారి రాములు, గోపాల్, ప్రమోద్ రెడ్డి, రవి గౌడ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.