calender_icon.png 8 July, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌డీ పట్టా అందుకున్న డాక్టర్ మహమ్మద్ రఫీ

08-07-2025 01:39:05 AM

చిట్యాల, జూలై 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహమ్మద్ రఫీ పి.హెచ్.డి పట్టా అందుకున్నారు.ఇటీవలే కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన 23వ స్నాతకోత్సవంలో భాగంగా  ‘తెలంగాణలో ఉర్సు జాతరలు  ఒక అధ్యయనం‘ అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు.

ఈమేరకు మహమ్మద్ రఫీ.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పి.హెచ్.డి పట్టా అందుకున్నారు. సోమవారం జూకల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయ బృందం డాక్టర్ మహమ్మద్ రఫీని అభినందించారు.