calender_icon.png 19 July, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్ బ్యాడ్మింటన్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీనివాస్ ఎన్నిక

19-07-2025 12:13:36 AM

కాగజ్‌నగర్, జులై 18 (విజయక్రాంతి): ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షునిగా   డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు. శుక్రవారం ఆయను కాగజ్‌నగర్ లో కమిటీ సభ్యులు సన్మానించారు. డాక్టర్ శ్రీనివాస్  మాట్లాడుతూ ఈ నెల 22,23,24 తేదీలలో  రెబ్బెన మండలం గోలేటిలో జరగబోయే తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి బాల బాలికల జట్లు పాల్గొంటారని, టోర్నమెంట్ ని విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  బాల్ బ్యాడ్మింటన్ రాష్ర్ట ఒలంపిక్ అసోసియేషన్ అడ్వుజర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు హరిలాల్,వెంకటేశ్వర్లు  జనరల్ సెక్రెటరీ తిరుపతి , ట్రెజరీ శంకర్ , అనిల్ గౌడ్, చందర్ ,మల్లేష్ , వెంకట రామకృష్ణ ,ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు.