02-12-2025 12:08:57 AM
అయిజ, డిసెంబర్ 1 : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అయిజ మండలం ఉత్తనూర్ గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసే క్రమంలో హై డ్రామా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తనూర్ గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వు అయ్యింది.
అయితే అందులో భాగంగా హోలియదాసరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు సర్పంచ్ గా నామినేషన్ వేస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన కొందరు ఎస్సీలు అడ్డుకుంటున్నారని హోలియా దాసరి సామాజిక వర్గానికి చెందిన జయమ్మ తో పాటు వారి భర్త రామ లింగన్న చేసినటువంటి వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.
అవేవీ వాస్తవం కాదని సోమవారం అధికారుల సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు జయమ్మ తెలిపారు. అయితే వారు నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సందర్భంలో గ్రామంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆందోళనలు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ప్రణాళిక మేరకు జరిగినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు.