06-05-2025 01:13:07 AM
సూర్యాపేట, మే 5 : జిల్లాలో వేసవి కాలం కావడంతో త్రాగు నీటి ఎద్దడి లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉందని ప్రజలు తమ పరిధిలోని అధికారులకు ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఆ సమస్య ను పరిష్కరించాలన్నారు.
రెవిన్యూ సదస్సులు జరుగుతున్నందున ఆయా గ్రామాలలో పంచాయతీ, పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టల్స్, ఆసుపత్రిలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హల్ లకి సంబందించిన భూముల వివరాలను రికార్డులలో తప్పని సరిగ్గా నమోదు చేయాలని ఆయా శాఖల అధికారులకి సూచించారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కాపాడుకోవాలన్నారు. ప్రజావాణిలో భూ సమస్యలకి సంబంధించి 38 దరఖాస్తులు, వివిధ ఎంపిడిఓలకు 36 దరఖాస్తులు, మున్సిపల్ కమిషనర్లకు 8, పంచాయతీ రాజ్ శాఖ కి (డి పి ఓ )7, మిగిలిన 9 వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయని, మొత్తం 97 దరఖాస్తులు వచ్చాయన్నారు. సంబంధిత అధికారులు త్వరితగతిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.