11-05-2025 12:19:43 AM
-సీపీ అవినాష్ మహంతి
రాజేంద్రనగర్, మే10 (విజయక్రాంతి) : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో డ్రోన్ల విని యోగంపై నిషేధం విధించారు. ఎయిర్ పోర్టుకు పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిషేధం జూన్ 9 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా బాణసంచా కాల్చడంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.