11-05-2025 12:21:05 AM
-బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్
ముషీరాబాద్, మే10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన యాదగిరి రోడ్డు ప్రమాదంలో మృతి బాధాకరమని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ అన్నారు.
ఈ మేరకు శనివారం గాంధీనగర్ డివిజన్ వాల్మీకి నగర్ బస్తి లో యాదగిరి స్వగృహం వద్ద నిర్వహించించిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యాదగిరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమ న్నారు.వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అంజలి ఘటించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు సుక్క యాదగిరి, నరసింహ ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు