11-05-2025 12:18:38 AM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ, అల్ఫోర్స్ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇలా విద్యాశాఖ అధికారి సిహెచ్ జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంలో కరీంనగర్ జిల్లాలో విద్యార్థులకు అనేక కార్యక్రమాలను రూపొందించడం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అద్భుతమైన అవకాశమని, ఈ అవకాశాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని సమాజంలో ఉత్తమంగా ఉండాలని అన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. రామడుగు మండల విద్యాధికారి వేణు, ఒలంపియాడ్ సమన్వయకర్త అశోక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం అధ్యక్షులు మనోహర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.