calender_icon.png 2 August, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు

21-07-2024 12:30:56 PM

హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎక్కడికక్కడే డ్రగ్స్ ముఠాలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. సికింద్రాబాద్ మెడికల్ షాపుల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తుట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. నిషేధిత డ్రగ్స్ ఆఫ్లోక్సాసిన్, ఆర్నిడాజోల్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. చిలకలగూడలోని జనఔషధి కేంద్రంలో నిషేధిత డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. అటు నగరంలోని శనివారం ఓపియాయిడ్‌ డ్రగ్‌ హెరాయిన్‌ను కలిగి ఉండి హైదరాబాద్‌లో విక్రయించాలని భావిస్తున్న నలుగురు డ్రగ్స్‌ వ్యాపారులను సైబరాబాద్‌ పోలీసులు, టీజీఎన్‌ఏబీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.