calender_icon.png 17 September, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రీల్స్ కోసం బైక్ స్టంట్స్.. ఒకరి మృతి, మరొకరి తీవ్రగాయాలు

21-07-2024 12:15:20 PM

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి, లైక్స్ రావడానికి రీల్స్ చేస్తూ యువత తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సమీపంలో జాతీయ రహదారిపై వర్షంలో కెటిఎమ్ బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శివ అనే యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నడంతో జాతీయ రహదారిపై ఒక లైన్ మరమ్మతుల కోసం రోడ్లు వేసి వదిలివేయగా ఆ రోడ్లపై యువకులు బైక్ లతో ఓవర్ స్పీడ్ తో రీల్స్ కోసం స్టంట్ లు చేయడంతో ఇలాంటి ఘటన చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.