calender_icon.png 17 September, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనం పైనుంచి దూకి మహిళ మృతి

21-07-2024 03:24:04 PM

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి మహిళ మృతి చెందింది. అశోక్ నగర్ లోని మూడో అంతస్తు పైనుంచి దూకి రాజేశ్వరి(50) అనే మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.