19-07-2025 12:55:43 AM
అదిలాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని జిమ్‌లలో నిషేధిత మత్తు పదార్థాలు వాడుతున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్‌కు వచ్చిన సమాచారం మేరకు స్థానిక వినాయక్‌చౌక్‌లోని లయన్ ఫిట్‌నెస్ జిమ్‌పై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
తహసీల్దార్ శ్రీనివాస్, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టగా 20 ఎం.ఎల్. ఏఎంపీ ఇంజక్షన్ బాటి ల్స్, 3 ఇంజక్షన్లు, 36 స్టెరాయిడ్స్ టాబ్లెట్లు, సర్జరీకి వాడే 3 డ్రగ్ ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. జిమ్ నిర్వాహకుడు షేక్ ఆదిల్‌పై కేసు నమోదు చేశారు. జిమ్‌కు వచ్చే వారికి డ్రగ్సును, స్టెరాయిడ్స్‌ను అందజేస్తున్నారు. దీంతో ఆర్డీవో వినోద్‌కుమార్ అనుమతితో లయన్ ఫిట్‌నెస్ జిమ్‌ను సీజ్ చేశామని డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు.