calender_icon.png 19 July, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం

19-07-2025 12:56:54 AM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి చంద్రశేఖర్

ఖమ్మం, జులై 18 (విజయ క్రాంతి): విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి చంద్రశేఖర్ అన్నారు. ఖమ్మంలోని దానవాయిగూడెం లో గల మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రశేఖర రావు మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలిసి ఉండాలని, పిల్లలకు మంచి చెడులు ఎప్పటికప్పుడు బోధించాలని అన్నారు. ఏది గుడ్ టచ్ ఏది బెడ్ టచ్ అనే విషయం గురించి వివరించారు.

బాల్య వివాహాల గురించి, వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. చిన్నారులపై లైంగిక దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని, అక్రమ రవాణా జరగకుండా చూడాలని మొబైల్ ఫోన్ల వల్ల జరిగే నష్టాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అరుణకుమారి, బోధన బోధన్ ఇతర సిబ్బందిపాల్గొన్నారు.