19-07-2025 12:55:32 AM
ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి
మణుగూరు, జులై 18 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించిదని, ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలని, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఏం కార్యాలయం లో పిట్టల నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహిళలు నెలకు రూ2,500 ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆడ బిడ్డల పెళ్లికి రూ.1లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న వాగ్దానం ఎక్కడ పోయిందని, 18 ఏళ్లు నిండిన యువతులకుస్కూటీ ఇస్తామన్న హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం అలసత్వం వల్ల మహిళలకు ఆశలు కోల్పోయా రన్నారు. మహిళా నాయకులు గ్రామాలలో పర్యటించి మహిళా సమస్యలపై అధ్యయనం చేయాలన్నారు.ఈ సమావేశంలో మహిళా సంఘం కార్యదర్శి తోట పద్మ, గౌరీ, సారిక, ముత్యాలు, కొడిశాల ధన,ఎస్.కె కతిజ బేగం పాల్గొన్నారు.