calender_icon.png 19 November, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి చేటు

19-11-2025 12:44:48 AM

సీఐ మన్మధ కుమార్

చౌటుప్పల్, నవంబర్ 18 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ  కార్యక్రమం  చౌటుప్పల్ పోలీసుస్టేషన్ సిబ్బందితో కలిసి నిర్వహించిన  సిఐ మన్మథకుమార్ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. స్నేహితులు, దగ్గరివారు ఎవరైనా మత్తుపదార్ధాలకు అలవాటు పడితె వెంటనే దూరంగా ఉండేలా కృషి చేయడం మనబాధ్యత అన్నారు. తామంతా యాంటీ డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.

డ్రగ్స్ మాయలో పడి యువత వారి శక్తియుక్తులను వృధా చేసుకోవద్దని సూచించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.  మాదక ద్రవ్యాలతో కలిగే చెడు పరిణామాలను గుర్తించా లని, గంజాయి, డ్రగ్స్ బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారని తెలిపారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారం దిశగా పయనించాలని సూచించారు అంతేకాకుండా నేను మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను అని ప్రతి ఒక్కరితో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు మరియు పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.