19-11-2025 12:46:01 AM
గజ్వేల్, నవంబర్ 18: తల్లిదండ్రులను వదిలి వచ్చానని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వర్గల్ మండలం తునికి ఖాల్సా గ్రామానికి చెందిన మధుప్రియ గజ్వేల్ మహిళా ఎడ్యుకేషన్ హబ్లో బాలికల ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది. కుటుంబాన్ని వదిలి వచ్చి చదువుతుండడంతో తల్లిదండ్రులపై బెంగ పెట్టుకొని సోమవారం సాయంత్రం పాఠశాలలో వాష్ రూమ్ వద్ద కాలం చెల్లిన హ్యాండ్ వాష్ ద్రవాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మధుప్రియ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తల్లిదండ్రులపై బెంగపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, హాస్టల్ వార్డెన్ లు తెలిపారు.