calender_icon.png 19 November, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుకను పట్టుకున్న పోలీసులు

19-11-2025 12:44:19 AM

  1. పైన డస్ట్.. లోపల ఇసుక

అక్రమార్కుల మాయాజాలం

తూప్రాన్, నవంబర్ 18 :తూప్రాన్ పట్టణం అల్లాపూర్ సమీపంలోని రెడీమిక్స్ కు మెదక్ ప్రాంతం నుండి టిప్పర్ ద్వారా నాసిరకం అక్రమ ఇసుకను తీసుకువచ్చే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే అక్రమార్కులు లోపల ఇసుక పైన డస్ట్ కనబడే విధంగా టిప్పర్ రూపురేఖలను తయారుచేసి సరఫరా చేస్తున్నారు.

ఈ సందర్భంగా తూప్రాన్ ఇసుక వ్యాపారులు మాట్లాడుతూ దూరప్రాంతాల నుంచి నాసిరకం ఇసుకను వేబిల్ లేకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రెడ్ మిక్స్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, దీనివల్ల స్థానికంగా ఉన్న ఇసుక వ్యాపారులకు బతుకుదెరువు కరువైందని వాపోయారు. వే బిల్, పర్మిషన్ లేకుండా నాసిరకం ఇసుకను అమ్మకాలు జరుపుతున్న వీరిపై పోలీసులు తక్షణమే స్పందించి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.