22-08-2025 11:44:14 PM
డిఎస్పి రఘు చందర్
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జగిత్యాల డి.ఎస్.పి దురిశెట్టి రఘు చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులకు గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి విధి నిర్వహణలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పి రఘు చందర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, డిజే సౌండ్లు మండపంలో పెట్టకూడదని అలా పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
వినాయకుని నిమజ్జన శోభాయాత్ర రోజున శాంతియుత వాతావరణంలో నిమర్జనం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క మండపం ఉదయం నుండే గణేష్ శోభాయాత్ర జరుపుకోవాలని అలా చేసుకోవడం వలన ప్రజలు భక్తులు గణేశుని శోభాయాత్రను చూడగలుగుతారన్నారు. శోభాయాత్ర అర్ధరాత్రి కొనసాగితే భక్తులు, ప్రజలు చూడలేక పోతారని అందుకు ముందుగానే శోభయాత్ర నిర్వహించుకోవాలన్నారు.తొమ్మిది రోజులపాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని పట్టణ ప్రజలు మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు.