calender_icon.png 26 January, 2026 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 మంది డీఎస్పీల బదిలీ

26-01-2026 02:28:23 AM

  1. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి
  2. ట్రైకమిషనరేట్ల పరిధుల్లో పలువురికి కొత్త బాధ్యతలు
  3. సీహెచ్.శ్రీధర్‌కు భువనగిరి ఎస్‌డీపీఓగా బాధ్యతలు 

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 25 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ శాఖలో పరిపాలనా పరమైన చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 మంది డీఎస్పీల(సివిల్)ను బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ బదిలీలు చేపడుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి.శివధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.

బదిలీ అయిన అధికారుల వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా ఉన్న ఎల్.ఆదినారాయణను కొత్తగూడెం ఎస్‌డీపీఓగా నియమించారు. ఇప్పటివరకు అక్కడ బాధ్యతలు నిర్వర్తించిన షేక్ అబ్దుల్ రహ్మాన్‌ను సీఐడీ విభాగం డీఎస్పీగా బదిలీ చేశారు. టీజీపీఏలో డీఎస్పీగా ఉన్న సీహెచ్.శ్రీధర్‌కు భువనగిరి ఎస్‌డీపీఓగా బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఎస్.సారంగపాణిని ఇల్లందు ఎస్‌డీపీఓగా నియమించారు.

నగర పరిధిలో జరిగిన మార్పుల్లో.. మల్కాజిగిరి ఏసీపీగా ఉన్న ఎం.ఆదిమూర్తిని రాచకొండ పరిధిలోని ఆదిభట్ల ఏసీపీగా, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా ఉన్న ఎస్.చక్రపాణిని సైబరాబాద్ ట్రాఫిక్ పరిధిలో మియాపూర్ ఏసీపీగా పంపారు. అలాగే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ బి.మోహన్ కుమార్‌ను జవహర్ నగర్ ఏసీపీగా, మల్కాజిగిరి ఏసీపీ బి.రవీందర్‌ను మేడిపల్లి ఏసీపీగా బదిలీ చేశారు.

మరోవైపు ఇద్దరు అధికారులను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. హైదరాబాద్ సీటీసీ ఏసీపీ డీవీ.ప్రదీప్ కుమార్‌రెడ్డి, ఇల్లందు ఎస్‌డీపీఓ ఎన్.చంద్రభానును తదుపరి పోస్టింగ్ కోసం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. బదిలీ అయిన అధికారులను తక్షణమే రిలీవ్ చేయాలని, వారు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సంబంధిత యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు.