14-10-2025 12:08:20 AM
మత్స్యకార సంఘం అడక్ కమిటీ జిల్లా అధ్యక్షులు గంజి ఆంజనేయులు
హన్వాడ, అక్టోబర్ 13: మత్స్యకారులకు ప్రభుత్వం అవసరమైన గుర్తింపు ఇస్తుందని హడాక్ కమిటీ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు గంజి ఆంజనేయులు అన్నారు. హన్వాడ మండలం గుండాల గ్రామ పరిధిలో మత్స్యకార సంఘం లింగన్నపల్లికి అనుసంధానమై ఇప్పటివరకు కొనసాగిందని లింగన పల్లికి ప్రత్యేక సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా గంజి ఆంజనేయులు మత్స్యకార సంఘం సభ్యులు శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గంజి ఆంజనేయులు మాట్లాడుతూ లింగన పల్లి సొసైటీ ప్రత్యేకంగా కొనసాగడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని మత్స్యకారులు అభివృద్ధి వైపు ప్రయాణం కొనసాగించాలని సూచించారు.
మునుముందు మత్స్యకారులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లింగన్నపల్లి మత్స్య సహకార సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
లింగన్నపల్లి ప్రత్యేక సొసైటీ
మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గము వన్వాడ మండలం గొండియాల, లింగన్నపల్లి ఉమ్మడి సొసైటీగా కొనసాగిందని మత్స్య సహకార సంఘంగా కొనసాగిందని జిల్లా అధ్యక్షులు గంజి ఆంజనేయులు తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయంలో లింగన్నపల్లిని ప్రత్యేక సొసైటీగా గుర్తిస్తూ ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ జారీ చేయడం జరిగిందన్నారు. ఇకనుండి లింగన్నపల్లి సొసైటీ కిందనే ఆ గ్రామ అభివృద్ధి పనులు మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.