20-07-2025 12:19:48 AM
చిరంజీవి ప్రస్తుతం తన 157వ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయ న కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షైన్‌స్క్రీ న్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలోని అందమైన ప్రదేశాల్లో జరుగుతోంది.
చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ డ్యూయెట్ పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుందని టీమ్ తెలిపింది. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జూలై 23వ తేదీతో ఈ షెడ్యూల్ పూర్తి కానుందని చెప్పా రు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరిలో విడుదల కానుంది.
షూటింగ్ వీడియోలు లీక్..
ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘మెగా157’కు సంబంధించి షూటింగ్ వీడియోను కొందరు రహస్యంగా రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయమై నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. అనధికారికంగా షూటింగ్ రికార్డు చేస్తే చట్ట పర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.